ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్ (Double ismart). ఈ చిత్రం ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
85 సెకన్ల నిడివి తో ఉన్న టీజర్ మాస్ ఆడియెన్స్ కి సిసలైన ట్రీట్ అందించింది అని చెప్పాలి. రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ను హామీ ఇస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరోసారి సినిమాకి హైలైట్ అని టీజర్ ను చూస్తే తెలుస్తుంది. పూరీ జగన్నాథ్ మార్క్ డైలాగ్స్ తో టీజర్ నిండి ఉంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తుండగా, కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి