విజయ్ – వంశీ ప్రాజెక్ట్ నుంచి డబుల్ ట్రీట్.?

Published on Jun 21, 2022 3:04 pm IST

ఇళయ తలపతి విజయ్ జోసెఫ్ హీరోగా మన టాలీవుడ్ స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. విజయ్ కెరీర్ లో 66వ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొనగా ఈరోజు ఈ చిత్రం నుంచి అవైటెడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

అయితే ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో రిలీజ్ కాబోతుండగా తన గత సినిమాల్లానే ఈ సినిమా నుంచి కూడా అభిమానుల కోసం డబుల్ ట్రీట్ అందిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం నుంచి సాయంత్రం ఫస్ట్ లుక్ రాబోతుండగా మళ్ళీ రాత్రి 12 గంటలకి ఈ చిత్రం సెకండ్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

దీనితో విజయ్ ఫ్యాన్స్ కి అయితే డబుల్ ట్రీట్ ఖాయం అని చెప్పాలి. అలాగే ఈ సినిమాలో విజయ్ డబుల్ రోల్ చేస్తున్నట్టు కూడా టాక్ ఉంది. మరి చూడాలి ఇవే వస్తాయో లేదో అనేది. ఇక ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :