మరొక డాక్టరేట్ ను అందుకోనున్న మోహన్ బాబు !
Published on Oct 1, 2017 3:11 pm IST


సీనియర్ హీరో మోహన్ బాబు గారికి మరొక గౌరవం దక్కనుంది. తమిళనాడుకు చెందిన ప్రతిష్టాత్మక ఎం.జి.ఆర్ ఇన్స్టిట్యూట్ ఆయన్ను గౌరవ డాక్టరేట్ తో సత్కరించనుంది. ఈ నెల 4వ తేదీన చెన్నైలో ఆయన ఈ డాక్టరేట్ ను అందుకోనున్నారు. దాదాపు 500లకు పైగానే చిత్రాల్లో వివిధ రకాల పాత్రల్లో నటించి నటుడిగా గొప్ప గురవరం తెచ్చుకున్న మోహన్ బాబు ఎన్టీఆర్ హయాంలో రాజ్య సభకు కూడా ఎంపికయ్యారు.

అంతేగాక 1993 లో శ్రీ విద్యానికేతన్ పేరిట ఎడ్యుకేషనల్ ట్రస్టును ఏర్పాటు చేసి విద్యారంగానికి ఎనలేని సేవ చేస్తున్నారాయన. సినీ, విద్యా రంగాల్లో ఆయన సేవలకు మెచ్చి భారత ప్రభుత్వం ఆయను పద్మశ్రీ అవార్డుతో సత్కరించగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఆయనకు గౌరవ డాక్టరేట్ ను బహుకరించింది. ప్రస్తుతం ఈయన స్వీయ నిర్మాణంలో ‘పెళ్ళైన కొత్తలో’ ఫేమ్ మదన్ రూపొందిస్తున్న ‘గాయత్రి’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

 
Like us on Facebook