సాయి పల్లవిని రీప్లేస్ చేసిన ‘డ్రాగన్’ బ్యూటీ? లెజెండరీ బయోపిక్ కి బిగ్ ఛేంజ్?

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ లో యువతకి బాగా నచ్చిన అతి కొద్ది మంది టాలెంటెడ్ హీరోయిన్స్ లో సాయి పల్లవి సహా ఇంకా కొందరు బ్యూటీస్ ఉన్నారు. అయితే సాయి పల్లవి ఇపుడు పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లు తన చేతిలో పెట్టుకుంది. ఇలా ఆమె చేస్తున్న సినిమాల్లో లెజెండరీ గాయకురాలు ఎం ఎస్ సుబ్బలక్ష్మి జీవిత చరిత్ర సినిమా కూడా ఒకటి.

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చేయనున్న ఈ సినిమాలో ఆమె ఎం ఎస్ సుబ్బలక్ష్మిగా నటిస్తుంది అని మొదట అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు లేటెస్ట్ ట్విస్ట్ గా సాయి పల్లవిని బ్యూటీ రుక్మిణి వసంత్ రీప్లేస్ చేసినట్టుగా ఇపుడు తెలుస్తుంది. రుక్మిణికి కూడా ఇప్పుడు యువతలో మంచి క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ తో డ్రాగన్ సహా పలు భారీ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. కానీ ఈ లెజెండరీ బయోపిక్ లోకి ఆమె రావడం మరింత విశేషంగా మారింది అని చెప్పవచ్చు. మరి ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ క్లారిటీ మాత్రం ఇంకా బయటకి రావాల్సి ఉంది.

Exit mobile version