“దృశ్యం 2” రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Jun 21, 2022 3:46 pm IST

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తన రాబోయే చిత్రం దృశ్యం 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు, ఇది మలయాళ దృశ్యం 2 బ్లాక్‌బస్టర్ చిత్రం యొక్క అధికారిక రీమేక్. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్డేట్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మేకర్స్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయడం జరిగింది.

నవంబర్ 18, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అదే విషయాన్ని తెలియజేసేందుకు ఒక పోస్టర్ ను విడుదల చేసారు. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రియా శరణ్, ఇషితా దత్తా, టబు, రజత్ కపూర్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. వయాకామ్ 18 సమర్పణలో పనోరమా స్టూడియోస్ మరియు టీ సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

సంబంధిత సమాచారం :