‘దృష్టి’ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా ఉండబోతున్నాయి !

ఎమ్ స్వేర్ బ్యాన‌ర్ పై రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో రాహుల్ రవీంద్రన్ హీరోగా తెర‌కెక్కుతున్న సినిమా ‘దృష్టి’. వెన్నెల కిశోర్ , సత్య ప్రకాష్ , రవివర్మ కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాలో ప్రేక్షకులను కట్టిపడేసే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని సమాచారం. క్రైమ్ నేపద్యలో ఈ సినిమా ఉండబోతోంది. నరేష్ కుమారన్ సంగీతం అందించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఈ సినిమా విడుదల తేదిని త్వరలో ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్. పావని గంగిరెడ్డి ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్ సరసన నటిస్తోంది. పి.బాలరెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ మూవీ అందరిని అలరిస్తుందని చిత్ర యూనిట్ ఈ మద్య జరిగిన ఒక ప్రెస్ మీట్ లో వెల్లడించారు.