ఆద్యంతం ఆసక్తికరంగా దృశ్యం 2 టీజర్!

Published on Nov 12, 2021 1:19 pm IST


వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో జీతూ జోసెఫ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం 2. డి. సురేష్ బాబు, ఆంటోనీ పెరుంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే చిత్ర యూనిట్ ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల చేస్తున్నట్లు నేడు అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 25 వ తేదీన ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల చేయనున్నారు.

అయితే ఈ చిత్రం నుండి టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. మొదటి భాగం కి కొనసాగింపు గా వస్తున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుంది అనేది టీజర్ లో చూపించడం జరిగింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో నదియా, తనికెళ్ళ భరణి, నరేష్, సంపత్ రాజ్, కృతిక జయ కుమార్, ఎస్తేర్ అనిల్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :