5 భాషల్లో ఫైనల్ మిక్స్ కారణంగా పుష్ప మాసివ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గైర్హాజరైన దేవి శ్రీ ప్రసాద్!

Published on Dec 12, 2021 9:11 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుక ను నేడు నిర్వహించడం జరిగింది.

ఇందుకు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ హాజరు కాలేదు. అందుకు గల కారణం ను సోషల్ మీడియా వేదిక గా వెల్లడిస్తూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. పుష్ప ఆడియో కి వస్తున్న రెస్పాన్స్ పట్ల స్పందించారు. ఆడియో ను ఆదరించినందుకు ప్రేక్షకులకు థాంక్స్ తెలిపారు. అయిదు బాషల్లో ఫైనల్ మిక్స్ పనుల కారణంగా ప్రీ రిలీజ్ వేడుక కి హాజరు కాలేక పోయినట్లు తెలిపారు. ఫన్ మిస్ అవుతున్నా అంటూ చెప్పుకొచ్చారు.ఈవెంట్ ను అందరూ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక త్వరలో కలుస్తా అంటూ చెప్పుకొచ్చారు. వర్క్ కి సంబంధించిన ఒక ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రం ఆడియో కి ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ రాగా సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. A

సంబంధిత సమాచారం :