వింటేజ్ బాస్ ని ప్రెజెంట్ చేసిన డీఎస్పీ, బాబీ.!

వింటేజ్ బాస్ ని ప్రెజెంట్ చేసిన డీఎస్పీ, బాబీ.!

Published on Dec 27, 2022 9:00 AM IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు కె ఎస్ రవీంద్ర(బాబీ) తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కూడా ఒకటి. మరి ఈ చిత్రానికి ముందు కూడా దర్శకుడు చెప్తున్నా మాట ప్రకారం వింటేజ్ బాస్ అలాగే పూనకాలు లోడింగ్ అనేవి ఎందుకు అంత గట్టిగా చెప్తున్నారు అనేది ఇప్పుడు ఒకో అప్డేట్ తో అంతకంతకూ ప్రూవ్ అవుతుంది.

ఇక ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్, పాటలు ఒకెత్తు కాగా నిన్న వచ్చిన వీరయ్య టైటిల్ సాంగ్ ఇంకో ఎత్తు అని చెప్పి తీరాలి. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఎనర్జిటిక్ సాంగ్ కానీ అలాగే ఇందులో మెగాస్టార్ ని దర్శకుడు ప్రెజెంట్ చేసిన విధానం కానీ వింటేజ్ బాస్ ని అయితే చూపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు.

అలాగే బాస్ ఫ్యాన్సే కాకుండా డీఎస్పీ ఫ్యాన్స్ కి కూడా వీరయ్య టైటిల్ సాంగ్ అనేది వింటేజ్ డీఎస్పీ ని తీసుకొచ్చింది అని అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇది చాలా కాలం తర్వాత అసలైన మెగాస్టార్ రేంజ్ సినిమాగా కూడా నిలిచేలా ఉందని ఫ్యాన్స్ మంచి ఎగ్జైట్ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు