తెలుగు ఇండియన్ ఐడల్ కంటిస్టెంట్స్ కి మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పీ అభినందనలు!

Published on May 19, 2022 8:36 pm IST


ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఓటిటి ప్లాట్ ఫామ్ ఏదైనా ఉంది అంటే అది ఆహా వీడియో అని చెప్పాలి. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటుగా, సరికొత్త కార్యక్రమాలను చేపడుతూ, ఎంటర్ టైన్మెంట్ రంగం లో దూసుకు పోతుంది. ఆహా వీడియో తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమం ను నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందుకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నారు.

తాజాగా ఈ కార్యక్రమం లో పార్టిసిపేట్ చేస్తున్న కొందరు కంటిస్టెంట్స్ ను మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అభినందించారు. తన ఇన్ స్టా గ్రామ్ లోని స్టోరీస్ లో కంటిస్టెంట్ లు పాడిన పాటను పోస్ట్ చేశారు. పుష్ప చిత్రం లోని శ్రీవల్లి సాంగ్ ను వారు పాడటం జరిగింది. పుష్ప ది రైజ్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగీతం తెలిసిందే. దీని రెండో పార్ట్ పుష్ప ది రూల్ కి సైతం దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

సంబంధిత సమాచారం :