అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లోని పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చింది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి ఇచ్చిన మ్యూజిక్ ఆల్ టైమ్ రికార్డు లను క్రియేట్ చేసింది. అయితే పుష్ప చిత్రం సక్సెస్ తో దేవి శ్రీ ప్రసాద్ కి బాలీవుడ్ నుండి సైతం భారీ ఆఫర్స్ వచ్చాయి.
అయితే సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న కభీ ఈద్ కభీ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. DSP ఇప్పటికే కొన్ని నంబర్లను కంపోజ్ చేసారు, అయితే సల్మాన్ ఖాన్‌కి అవి నచ్చకపోవడంతో, తాజా అప్డేట్ ప్రకారం DSP చిత్రం నుండి తప్పుకున్నాడు. కొత్త సంగీత దర్శకుడు కూడా ఈ ప్రాజెక్ట్‌ని టేకప్ చేసాడు. సల్మాన్ ఖాన్ కూడా ఈ నిర్ణయం గురించి చాలా కూల్‌గా ఉన్నాడు. ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.