దేవి హ్యాట్రిక్ మ్యాజిక్..”పుష్ప” ఐటెం సాంగ్ కి భారీ రెస్పాన్స్.!

Published on Dec 11, 2021 10:02 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ సినిమా “పుష్ప ది రైజ్”. మొత్తం రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమా మొదటి నుంచి కూడా మంచి అంచనాలు నెలకొల్పుకొని ఉంది. అయితే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ టైం లో మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ సాంగ్ ఈ సినిమా నుంచి రిలీజ్ చేశారు.

మామూలుగానే అల్లు అర్జున్ సుకుమార్ కాంబో అంటేనే అదురుతుంది. అందులోని ఐటెం సాంగ్స్ కి అయితే స్పెషల్ క్రేజ్ ఉన్నాయి. అలా ఇప్పటి వరకు వచ్చిన ఏ సాంగ్ కూడా వీరి నుంచి డిజప్పాయింట్ చెయ్యలేదు. ఇక వీరిద్దరిదితో అల్లు అర్జున్ కూడా కలిస్తే ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్ అలాగే ఆ సాంగ్స్ ట్రెండ్ సెట్టింగ్ గా కూడా నిలిచాయి. ఇక ఇప్పుడు పుష్ప తో హ్యాట్రిక్ ఐటెం సాంగ్ కూడా వచ్చేసింది.

ఈ సాంగ్ కి మాత్రం దేవి కొత్తగా చాలా ఫ్రెష్ ట్యూన్ ని చేసాడని చెప్పాలి. అలాగే సమంతా కూడా నెవర్ బిఫోర్ సిజ్లింగ్ అవతార్ లో కనిపించడంతో మోస్ట్ అవైటెడ్ గా వచ్చిన ఈ సాంగ్ టాలీవుడ్ నుంచి ఫాస్టెస్ట్ రికార్డ్స్ సెట్ చేసుకుంటూ వెళుతుంది. 12కేవలం గంటల్లోనే 8 మిలియన్ దగ్గరకి వ్యూస్ ఈ సాంగ్ తెచ్చుకొంది. ఇప్పుడుకి 8.5 మిలియన్స్ తో కొనసాగుతుంది. మొత్తానికి మాత్రం దేవి హ్యాట్రిక్ మ్యాజిక్ బాగా వర్కౌట్ అయ్యిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :