‘దేవి శ్రీ ప్రసాద్’ ఆ డబ్బంతా డొనేట్ చేసేశాడు !

DSP1
తెలుగు పరిశ్రమలో చాలా కింది స్థాయి నుడి పైకొచ్చిన వ్యక్తుల్లో సంగీత దర్శకుడు ‘దేవి శ్రీ ప్రసాద్’ ఒకరు. తన సంగీతంతో, మంచి తనంతో, అంతులేని ఎనర్జీతో ఏ మ్యూజిక్ డైరెక్టర్ కు లేని క్రేజ్ ను దేవి శ్రీ సంపాదించుకున్నాడు. అందుకే ఆయన్ను అభిమానవులంతా ‘రాక్ స్టార్ డిఎస్పీ’ అంటుంటారు. ఈ మ్యూజిక్ సునామి ఈ మధ్య యూఎస్ టూర్ వెళ్లి టెలివిజన్ ప్రోగ్రామ్స్ చేసి కొంత డబ్బుని సంపాదించాడు.
ఇండియా తిరిగొచ్చాక దేవి శ్రీ ఆ డబ్బునంతా కంటి చూపు సరిగాలేని పిల్లల వైద్యం నిమిత్తం డొనేట్ చేసేశాడు. ఈ సంగతి తెలిసిన అందరూ ఆయన మంచితనాన్ని అభినందిస్తున్నారు. సినీ ప్రముఖుల్లో సమాజం పట్ల పెరిగిన భాద్యతను మెచ్చుకుంటున్నారు. ఆయనలాగే ఇంకొందరు కూడా ఇలాంటి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నారు.