అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రం ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందొ అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ చిత్రం బాలీవుడ్ ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. యూ ట్యూబ్ మ్యూజిక్ లో సైతం పుష్ప ది రైజ్ చిత్రం లోని పాటలు టాప్ లో దూసుకు పోతున్నాయి. ఈ మేరకు ప్రొడ్యూసర్, టి సిరీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ పుష్ప ది రైజ్ చిత్రానికి సంగీతం అందించిన దేవీ శ్రీ ప్రసాద్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
భాషభేదం లేకుండా సరిహద్దులను బద్దలు కొడుతుంది పుష్ప అంటూ చెప్పుకొచ్చారు. తెలుగు లో చార్ట్ బస్టర్ ఆల్బమ్ గా నిలిచిన పుష్ప ది రైజ్, బాలీవుడ్ లో కూడా టాప్ 5 లో ఉంటుంది అని తెలిపారు. దేవి శ్రీ ప్రసాద్ సహకారం కొనసాగించడం అనేది చాలా సంతోషం గా ఫీల్ అవుతున్నా అని భూషణ్ కుమార్ తెలిపారు. భూషణ్ కుమార్ చేసిన వ్యాఖ్యల పట్ల దేవి శ్రీ ప్రసాద్ సంతోషం వ్యక్తం చేస్తూ, థాంక్స్ తెలిపారు.
ThaankUu dear #BhushanKumar sir !!
For all the lovely words !! ❤️????@TSeries #PushpaHindi #PushpaTheRise @MythriOfficial pic.twitter.com/EA0jBIsjnU— DEVI SRI PRASAD (@ThisIsDSP) January 18, 2022