వైరల్: ఎస్పీ బాలు పాటతో మెస్మరైజ్ చేసిన్ దుబాయ్ షేక్..!

Published on Sep 8, 2021 1:09 am IST


గాన గంధర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాటలు మాత్రం ఎప్పటికీ మన మదిలో మెదులుతూనే ఉంటాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎస్పీ బాలుకు కోట్లాదిమంది అభిమానులున్నారన్న సంగతి తెలిసిందే. ఓ దుబాయ్ షేక్ ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం గారు పాడిన పాటను పాడి అందరిని మెస్మరైజ్ చేశాడు. 1986లో వ‌చ్చిన‌ సూప‌ర్ హిట్ సినిమా సిరివెన్నెల‌లోని ‘విధాత త‌ల‌పున విక‌సించిన‌ది ఈ గీతం అంటూ సాగే పాట అప్పట్లో ఎంతో మందిని మంత్రముగ్ధులని చేసింది.

అయితే ఈ పాటకు దుబాయ్ షేక్ కూడా ఫిదా అయ్యాడు. ‘స‌రస‌స్వ‌రసురఝ‌రీగ‌మ‌న‌మ‌వు సామ‌వేద సార‌మిది.. నే పాడిన జీవన గీతం.. ఈ గీతం.. విరించినై విర‌చించితిని ఈ క‌వ‌నం.. విపంచినై వినిపించితిని ఈ గీతం’ అంటూ ఎంతో చక్కగా పాడాడు. ఈ దుబాయ్ షేక్ పాట పాడిన టిక్‌టాక్ వీడియోను ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగు వాళ్లు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత సమాచారం :