యువ హీరో సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభం !


సుశాంత్ హీరోగా నటిస్తోన్న సినిమా పేరు చిలసౌ. హీరో రాహుల్ రవీంద్రన్ ఈ సినిమా తో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. నలభై రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసాడు రాహుల్. దర్శకుడిగా తొలి సినిమానే రాహుల్ ఇంత వేగంగా పూర్తి చేయడం ఆచ్చార్యకరమైన విషయమే.

ప్రశాంత్ విహారి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. డిజే, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాలకు ఎడిటర్ గా పనిచేసిన చోటా కె ప్రసాద్ ఈ సినిమాకు ఎడిటర్. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా పై ఇండస్ట్రీ లో పాజిటివ్ బజ్ ఉండడం విశేషం.