విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా “వెంకీ అనిల్ 3” అనే టైటిల్ ను పెట్టారు. అయితే, ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు ప్రారంభిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డబ్బింగ్ స్టూడియో నుండి వదిలిన వీడియో క్లిప్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ వీడియో క్లిప్ లో వెంకటేష్‌తో పాటు ఐశ్వర్య రాజేష్ మరియు ఇతర పాత్ర దారులు అందరూ ఉత్సాహంగా కనిపిస్తుండటం విశేషం. అన్నట్టు ఈ వీడియోలోని షాట్స్ ఒక పాటలోనివి అని తెలుస్తోంది.
కాగా ఈ సినిమాకి సంబంధించి 90 శాతం షూటింగ్ కంప్లీట్ అయిందని ప్రొడక్షన్ టీం తెలిపింది. వెంకటేష్ చరిష్మాతో పాటు అనిల్ రావిపూడి హ్యూమర్ మార్క్ కూడా సినిమాలో హైలైట్ గా నిలుస్తాయట. అన్నట్టు త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం 2025 సంక్రాంతి రేసులో ఉంది. విడుదల తేదీ పై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.
#SVC58 DUBBING BEGINS ????️
Team #VenkyAnil3 completed 90% of the shoot and post-production happening in full swing to entertain you all on the big screens ????????????
TITLE & FIRST LOOK SOON ❤️????
Victory @VenkyMama @AnilRavipudi @Meenakshiioffl @aishu_dil #DilRaju #Shirish… pic.twitter.com/BnEn2lPu2P
— Sri Venkateswara Creations (@SVC_official) October 27, 2024