పూజా కార్యక్రమాలతో “బ్రో” డబ్బింగ్ వర్క్ షురూ!

పూజా కార్యక్రమాలతో “బ్రో” డబ్బింగ్ వర్క్ షురూ!

Published on May 30, 2023 7:01 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం BRO(బ్రో). నటుడు, దర్శకుడు సముద్ర ఖని దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ను జూలై 27, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకున్నాయి.

టీమ్ సోషల్ మీడియా వేదిక గా మరొక అప్డేట్ ను షేర్ చేయడం జరిగింది. ఈ చిత్రం కి సంబంధించిన డబ్బింగ్ వర్క్ ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించినట్లు పేర్కొంది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు