విశాల్ ను కూడా వదలని ఎయిర్ పోర్ట్ అధికారులు !

5th, November 2017 - 01:51:10 PM

తమిళ స్టార్ హీరో విశాల్ కు తమిళనాడు ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే విశాల్ హిట్ సినిమా ‘తుప్పరివాలన్’ తెలుగులో ‘డిటెక్టివ్’ పేరుతో రిలీజ్ కానుంది. దీంతో చిత్ర టీమ్ ఈరోజు ఉదయం హైదరాబాద్లో ప్రమోషన్ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసింది. ఉదయం 9 గంటల 30 నిముషాలకు జరగాల్సిన ఈ కార్యక్రమానికి చిత్రంలో నటించిన ఆండ్రియా ముందుగానే హాజరుకాగా విశాల్ మాత్రం 12 గంటల 20 నిముషాలకు హాజరయ్యారు.

ఇంత ఆలస్యానికి కారణం ఏమిటా అని ఆరాతీస్తే తమిళనాడు ఎయిర్ పోర్ట్ లో 5 నిముషాలు ఆలస్యంగా రిపోర్ట్ చేయడం వలన యాజమాన్యం విశాల్ కు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదట. దీంతో చేసేదేమీ లేక విశాల్ తర్వాతి ఫ్లైట్ కు టికెట్ బుక్ చేసుకుని హైదరాబాద్ చేరుకోని కార్యక్రమానికి హాజరయ్యారు. ఇకపోతే మిస్కిన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగులో ఈ నెల 10న విడుదలకానుంది.