కెజిఎఫ్ హీరో యష్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన దుల్కర్ సల్మాన్

Published on Jan 31, 2023 11:00 pm IST

ఇటీవల కన్నడలో తెరకెక్కి ఆపై పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ అయి అన్ని చోట్ల కూడా ఎంతో గొప్ప విజయం సొంతం చేసుకున్న సినిమాలు కెజిఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీస్ రెండూ కూడా ఒకదానిని మించేలా మరొకటి బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల కలెక్షన్ ని కొల్లగొట్టాయి ఇక వీటి సక్సెస్ తో కెజిఎఫ్ టీమ్ కి ముఖ్యంగా హీరో యష్ కి వరల్డ్ వైడ్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు దక్కాయి. ఇక మరోవైపు ప్రస్తుతం యువ హీరోగా మలయాళంతో పాటు తెలుగు ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో దుల్కర్ సల్మాన్ ఒకరు.

కొన్నాళ్ల క్రితం హను రాఘవపూడి దర్శకత్వంలో సీతారామం మూవీ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్నారాయన. అయితే విషయం ఏమిటంటే, తాజాగా తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో కొద్దిసేపు చాట్ చేసిన దుల్కర్, వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అందులో భాగంగా హీరో యష్ గురించి మీ అభిప్రాయం చెప్పండి అంటూ ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు దుల్కర్ బదులిస్తూ, నేను మరియు నా టీమ్ ఇటీవల మైసూర్ లో షూటింగ్ చేస్తున్న సమయంలో మా అందరికీ దగ్గరుండి మరీ భోజన ఏర్పాట్లు చూసుకున్న మంచి మనసున్న వ్యక్తి యష్ అని, నిజంగా ఆయన రాకింగ్ స్టార్ అని తెలిపారు. కాగా యష్ పై దుల్కర్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :