దుల్కర్ సల్మాన్ ఫ్యాన్స్‌కు సాలిడ్ అప్‌డేట్.. ‘ఆకాశంలో ఒక తార’ విడుదల తేదీ ఖరారు!

తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా క్రేజీ చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి చిత్ర బృందం అధికారిక ప్రకటన వెలువరించింది.

నవంబర్ 20న గ్రాండ్ రిలీజ్

‘ఆకాశంలో ఒక తార’ చిత్రాన్ని 2026 నవంబర్ 20న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో దుల్కర్ సల్మాన్ సింపుల్ మిడిల్-క్లాస్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్

ఈ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తుండగా, సుజిత్ సారంగ్ కెమెరా బాధ్యతలు, ప్రవీణ్ కె.ఎల్ ఎడిటింగ్, శ్వేత సబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ నిర్వహిస్తున్నారు. బలమైన టెక్నికల్ టీమ్‌తో పాటు దుల్కర్ సరికొత్త పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో నవంబర్ 20న థియేటర్లలో ఈ సినిమా ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి.

Exit mobile version