క్రేజీ బజ్ : స్టార్ డైరెక్టర్ తో నెక్స్ట్ మూవీ ఫిక్స్ చేసిన దుల్కర్

క్రేజీ బజ్ : స్టార్ డైరెక్టర్ తో నెక్స్ట్ మూవీ ఫిక్స్ చేసిన దుల్కర్

Published on Aug 19, 2022 2:00 AM IST

తాజా మూవీ సీతారామంతో తొలిసారిగా డైరెక్ట్ తెలుగు సినిమా చేసి మన ఆడియన్స్ నుండి కూడా బాగా క్రేజ్ సొంతం చేసుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. తండ్రి మమ్ముట్టి నటవారసుడిగా చిత్రసీమకు ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా నటుడిగా మొదటి నుండి తనని తాను ప్రూవ్ చేసుకుని సూపర్ గా దూసుకుపోతున్న దుల్కర్ సీతారామంలో తన సూపర్ పెర్ఫార్మన్స్ తో అందరి మనసులు దోచుకున్నారు.

లెఫ్టినెంట్ రామ్ క్యారెక్టర్ లో ఆయన నటనకు ఆడియన్స్ తో పాటు విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందాయి. అయితే లేటెస్ట్ గా ఆయన మరొక టాలీవుడ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది క్రేజీ టాలీవుడ్ బజ్. హ్యాపీ డేస్, ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో తనకంటూ స్టార్ డైరెక్టర్ గా గొప్ప పేరు సొంతం చేసుకుని ప్రస్తుతం ధనుష్ తో మూవీ చేస్తున్న శేఖర్ కమ్ముల, తన నెక్స్ట్ మూవీని దుల్కర్ తో చేయనున్నారట. ఈ మూవీకి సంబంధించి ఇద్దరి మధ్య డిస్కషన్స్ జరిగాయని, త్వరలోనే దీనిపై అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా రానుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు