దుల్కర్ సల్మాన్ – హను రాఘవపూడి ల “సీతా రామం” రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on May 25, 2022 5:01 pm IST

హ్యాండ్సమ్ హీరో దుల్కర్ సల్మాన్, బ్యూటీఫుల్ మృణాల్ ఠాకూర్, రష్మిక హీరో హీరోయిన్ లుగా నటించిన రొమాంటిక్ సాగా సీతా రామం. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సీతా రామం చిత్రాన్ని ఆగస్ట్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏక కాలంలో విడుదల కానుంది. హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, స్వప్న సినిమా పతాకం పై అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. సీతా రామం చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. ఇప్పటికే పాటలు మంచి బజ్ క్రియేట్ చేశాయి.

సంబంధిత సమాచారం :