రేపే దుల్కర్ పరిణయం ట్రైలర్..!

Published on Sep 21, 2021 9:54 pm IST


మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ జంట‌గా అనూప్ స‌త్య‌న్ దర్శకత్వంలో మళయాళంలో తెరకెక్కించిన ‘వ‌ర‌ణే అవ‌శ్య‌ముంద్’ అక్కడి ప్రేక్ష‌కుల, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. హృద‌యానికి హ‌త్తుకునే ఈ ఎంట‌ర్‌టైన‌ర్‌ని ‘పరిణయం’ అనే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రీమియర్ కాబోతుంది.

అయితే ఈ సినిమా ట్రైలర్‌ని రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్టు ఆహా తెలిపింది. ఓ ఫ్రెంచ్ ట్యూట‌ర్‌, కుమార్తె నికితాతో జీవితం వెళ్ల‌దీసే సింగిల్ పేరెంట్ నీనా మ‌ధ్య న‌డిచే క‌థాంశంతో ఈ మూవీ తెర‌కెక్కింది. ఎమోష‌న్స్‌, హ్యుమ‌ర్‌, రొమాన్స్ అంశాల క‌ల‌యిక‌గా మాన‌వ సంబంధాల‌పై అభిప్రాయాన్ని తెలియ‌జేసే సినిమా ‘ప‌రిణ‌యం’ అని ఆహా పేర్కొంది.

సంబంధిత సమాచారం :