బాలయ్య విలన్ అతనే.. ఇక నుంచి అధికారకమే!

Published on Jan 3, 2022 10:55 am IST


నట సింహం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో తన 107వ సినిమాని చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించబోతున్నాడు అని చిత్రబృందం నేడు అధికారికంగా ప్రకటించింది. కన్నడంలో దునియా సినిమాతో బాగా పాపులరయ్యాడు దునియా విజయ్. మంచి నటుడు, ముఖ్యంగా విలన్ పాత్రలకు పర్ఫెక్ట్ గా సరిపోతాడు.

అందుకే, గోపీచంద్ మలినేని దునియా విజయ్ ను విలన్ గా ఫైనల్ చేశాడు. ఓ దశలో కథానాయకుడు విజయ్ సేతుపతిని బాలయ్యకు విలన్ గా ఒప్పించాలని ప్రయత్నాలు చేశారు. అవి వర్కౌట్ కాలేదు. నట సింహం కి పోటీగా డైలాగులు చెప్పాలంటే విజయ్ మంచి యాక్టర్ కావాలి, అందుకే.. ఫైనల్ గా దునియా విజయ్ ను ఫైనల్ చేశారు. ఇక క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారధ్యంలో ఈ సినిమా రానుంది. అన్నట్టు ఈ సినిమాలో హీరోయిన్ శృతి హాసన్ నటిస్తోంది.

సంబంధిత సమాచారం :