హీటెక్కుతున్న దసరా..అఖిల్ కూడా ల్యాండ్ అయ్యాడు!

Published on Sep 7, 2021 11:00 am IST


మొత్తం ఇండియన్ సినిమా దగ్గర ఎక్కడ లేని విధంగా సినిమాలను మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. దానికి ఉదాహరణ ఇప్పుడు సినిమాలు అందుకుంటున్న విజయాలే అని చెప్పాలి. ఎన్ని ఓటిటి లు వచ్చినా థియేట్రికల్ రెస్పాన్స్ మాత్రం సాలిడ్ గా ఇస్తున్నారు. అందుకే మేకర్స్ కూడా తమ సినిమాల విడుదలలు మళ్ళీ ఎప్పటికప్పుడు లాక్ చేసుకుంటున్నారు.

ఇక పండుగ మూమెంట్ వస్తే అప్పుడు సినిమాల సందడే వేరు.. ఇక వచ్చే వినాయక చవితికి ఆల్రెడీ పలు చిత్రాలు రెడీగా ఉండగా దసరా రేస్ మాత్రం మరిన్ని సినిమాల అనౌన్సమెంట్స్ తో హీటెక్కుతోంది. మరి ఇది వరకే ‘కొండ పొలం’, ‘మహా సముద్రం’, బాలయ్య ‘అఖండ’ కూడా ఉందని టాక్ ఉంది. అంతే కాకుండా విశాల్ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం ఎనిమి కూడా ఫిక్స్ అయ్యింది.

మరి ఈ రేస్ లో అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” కూడా వచ్చేసింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 8న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అలాగే గోపి సుందర్ సంగీతం అందివ్వగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :