కృతజ్ఞతలు చెప్పేందుకు సిద్దమవుతున్న ‘డీజే’ టీమ్ !


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘దువ్వాడ జగన్నాథమ్’ బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండమైన వసూళ్లను సాధిస్తూ బన్నీ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. మొదటి రోజు ఏపీ, తెలంగాణాల్లో దాదాపు రూ.18 కోట్లు రాబట్టిన ఈ చిత్రం రెండవ రోజు శనివారం ముగిసేసరికి రూ.26.71 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో చిత్ర టీమ్ ఇంత అద్భుతమైన వసూళ్లను అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాలని నిర్ణయించింది.

అందుకే థ్యాంక్యూ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈరోజు సాయంత్రం హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్లో ఉన్న జె.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుక జరగనుంది. అల్లు అర్జున్, పూజా హెగ్డే, హరీష్ శంకర్లతో పాటు నిర్మాత దిల్ రాజు, ఇతర చిత్ర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.