‘ఎన్టీఆర్, రాంచరణ్’ ప్రొడ్యూసర్ కొడుకు ‘తేజా’ హీరోనా ?

teja

కాలం కలసి రాకపోవడం అంటే ఇదేనేమో. హిట్ కొట్టినా దర్శకుడు తేజాకి మాత్రం సినిమా పట్టాలెక్కట్లేదు. వెంకటేష్ తో అనుకున్న సినిమా ఆగిపోయింది. ఎన్టీఆర్ బయోపిక్ నుండి తప్పుకున్నాడు. రానాతో ఒక సినిమా చేద్దామనుకుంటున్నాడు గాని అది ఇప్పుడల్లా మొదలైయ్యేలా కనిపించట్లేదు. ఒక దశలో ఉదయ్ కిరణ్ బయోపిక్ చెయ్యబోతున్నాడని వార్తలు కూడా వచ్చాయి. ఏది ఏమైనా తేజాకి మాత్రం హీరో కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది.

అయితే ప్రస్తుతం తేజాకి హీరో దొరికేశాడని తెలుస్తోంది. ప్రముఖ ప్రొడ్యూసర్ దానయ్య తన కుమారుడుని హీరోని చేద్దాం అనుకుంటున్నారు. తేజ దర్శకత్వంలో తన కుమారుడ్ని హీరోగా పరిచయం చేద్దామని నిర్ణయించుకున్నారట. కొత్త హీరోలను పరిచయం చేయడంలో తేజాకి మంచి అనుభవం ఉంది. నితిన్, ఉదయ్ కిరణ్..నవదీప్‌ లాంటి హీరోలను పరిచయం చేసింది తేజానే. అందుకే దానయ్య కూడా తేజ అయితేనే బాగుంటుందని అనుకుంటున్నారు. భారీ రెమ్యూనిరేషన్ ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. తేజా ఇంట్రస్ట్ గానే ఉన్నారని సమాచారం.

Exit mobile version