“ఆర్ఆర్ఆర్” మూవీ అభిమానులకు డివివి ఎంటర్టైన్మెంట్ రిక్వెస్ట్

Published on Mar 27, 2022 5:00 pm IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో దర్శక దిగ్గజం జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించిన చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి భారీ రెస్పాన్స్ ను కొల్లగొట్టింది.

అయితే ఈ చిత్రం కి సంబంధించిన పలు కీలక సన్నివేశాలను అభిమానులు, ప్రేక్షకులు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉండటం జరుగుతుంది. ఈ మేరకు ప్రొడక్షన్ సంస్థ తాజాగా ఒక పోస్ట్ చేయడం జరిగింది. స్పాయిలర్స్ ను రికార్డ్ చేయకండి, సోషల్ మీడియా లో పోస్ట్ చేయకండి అంటూ వేడుకోవడం జరిగింది. మీరు ఎలా అయితే ఆర్ ఆర్ ఆర్ మూవీ మ్యాజిక్ ను ఎంజాయ్ చేశారో అదే విధంగా అందరినీ కూడా ఎంజాయ్ చెయ్యనివ్వండి అంటూ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :