మాస్ మహారాజ “ఈగిల్” రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Sep 27, 2023 4:29 pm IST


కార్తీక్ ఘట్టంనేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈగిల్ 2024 సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని జనవరి 13, 2024న థియేటర్ల లో గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ధృవీకరించారు. ఈ సినిమా సంక్రాంతికి రాకపోవచ్చని కొన్ని ఊహాగానాలు వచ్చాయి, కానీ మేకర్స్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. విడుదల తేదీని తెలియజేస్తూ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

పోస్టర్‌లో రవితేజ నిల్చుని ఉండగా, నిప్పంటించిన ఇల్లు కనిపిస్తుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. కొన్ని నెలల క్రితం విడుదలైన గ్లింప్స్‌ కి ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ బిగ్గీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక గా నటిస్తుండగా, కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దావ్‌జాంద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :