రవితేజ క్రాక్ మార్నింగ్ షో క్యాన్సల్ !

krack 4

మాస్ మ‌హారాజా ర‌వితేజ – గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో ఈ రోజు భారీ స్థాయిలో రిలీజ్ కావాల్సిన ‘క్రాక్’ సినిమా మార్నింగ్ 8:45 షో క్యాన్సల్ అయింది. నిర్మాత ఠాగూర్ మధు సినిమా పనిలో చెన్నైలో ఉండటం వల్ల.. మార్నింగ్ షో విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావడంతో 8:45 షో క్యాన్సల్ అయింది. అయితే పది గంటల షో పడే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

ఇక నిజ జీవిత సంఘటనల ఆధారంగా రానున్న క్రాక్ సినిమా ర‌వితేజ 66వ చిత్రంగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవితేజ నటించిన లాస్ట్ సినిమా డిస్కో రాజా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో రవితేజకి క్రాక్ కీలకం కానుంది. ఇక క్రాక్ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.

Exit mobile version