వైరల్ పిక్ : బాడీ డిమాండ్ చేసినపుడు తినాల్సిందే అంటున్న రకుల్

వైరల్ పిక్ : బాడీ డిమాండ్ చేసినపుడు తినాల్సిందే అంటున్న రకుల్

Published on Nov 25, 2022 3:00 AM IST

టాలీవుడ్ స్టార్ నటీమణుల్లో ప్రస్తుతం మంచి అవకాశాలతో అలానే సక్సెస్ లతో కొనసాగుతున్న వారిలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. ఇటీవల అటాక్, రన్ వే 24, డాక్టర్ జి, కట్ ఫుట్లీ, థాంక్ గాడ్ వంటి బాలీవుడ్ సినిమాల ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఆమె తాజాగా కమల్ హాసన్, శంకర్ ల ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ ఇండియన్ 2 లో కీలక పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.

ఇక తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆడియన్స్, ఫ్యాన్స్ తో తన సినీ, వ్యక్తిగత విషయాలు పంచుకునే అలవాటు గల రకుల్, కొద్దిసేపటి క్రితం ఒక పోస్ట్ పెట్టారు. జిమ్ చేసే టైం ఆసన్నమయిందని, అయితే ఒక్కో సమయంలో మన బాడీ బాగా ఫుడ్ ని డిమాండ్ చేస్తుందని, అటువంటి టైంలో ఏ మాత్రం సంకోచించకుండా హ్యాపీగా తినాల్సిందే అంటూ రెండు రకాల పరోటాల పిక్స్ ని పోస్ట్ చేసారు. నిజానికి తను పరోటాలు తినను అనుకుంటారని, కానీ అటువంటిది ఏమీ లేదు, చక్కగా వాటిని నేను తినేస్తాను అంటూ ఆమె తన పోస్ట్ లో తెలిపారు. ప్రస్తుతం రకుల్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు