‘జన నాయగన్’ లీక్ వ్యవహారం.. ఆ వివాదంపై ఎడిటర్స్ యూనియన్ క్లారిటీ..!

Jana Nayagan

దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘జన నాయగన్’ ఆన్‌లైన్ లీకేజీ వ్యవహారం ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది. వందల కోట్ల వ్యాపారం ముడిపడి ఉన్న ఈ సినిమా క్లిప్స్ బయటకు రావడంతో చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురు వ్యక్తులను తమిళ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ లీకేజీకి హైదరాబాద్‌కు చెందిన ఒక పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో కారణమని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

ఈ రూమర్లపై సౌత్ ఇండియా ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ తాజాగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ఈ లీకేజీకి సంబంధించి తాము నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఏ ఒక్క స్టూడియో పేరును ప్రస్తావించలేదని, హైదరాబాద్ స్టూడియోపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని వారు తేల్చి చెప్పారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, పలు ప్రాంతాల్లోని వ్యక్తులు ఇందులో భాగమై ఉండవచ్చని అసోసియేషన్ వెల్లడించింది. ఆధారాలు లేని వార్తలను నమ్మవద్దని వారు కోరారు.

కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు మరియు బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Exit mobile version