మరో లోకంలోకి తీసుకెళ్తున్న “రాధే శ్యామ్” ఈ రాతలే సాంగ్.!

Published on Feb 25, 2022 12:52 pm IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ గ్రాండ్ విజువల్ ట్రీట్ పై మంచి అంచనాలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ మళ్ళీ ఎంతో కాలం తర్వాత చేస్తున్న స్వచ్ఛమైన ప్రేమకథ ఇది కావడంతో అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తూ వచ్చారు.

మరి అందుకు తగ్గట్టు గానే మేకర్స్ ప్రతి ఎలిమెంట్ ని చాలా ఆసక్తిగా ప్లాన్ చేశారు. ముఖ్యంగా సినిమాలోని సాంగ్స్ అయితే సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొల్పాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ తాలూకా వీడియో ని ఫైనల్ గా ఈరోజు రిలీజ్ చేశారు. మరి ఈ సాంగ్ మాత్రం సూపర్బ్ గా ఉందని చెప్పాలి. ప్రభాస్ లుక్స్ నుంచి పూజ హెగ్డే తో ఇద్దరి మధ్య చూపించిన లవ్ ట్రాక్ కానీ చాలా అందంగా ఉన్నాయి.

అలాగే ఆ విజువల్స్ సినిమాలో కనిపిస్తున్న సెటప్ అంతా కూడా దానితో సాంగ్ లోని సోల్ ఖచ్చితంగా ఆడియెన్స్ లో ఆ సినిమా లోకం లోకి తీసుకెళ్లేదిలా అనిపిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవరాల్ గా అయితే ఈ సాంగ్ సినిమాలో ఒక బిగ్గెస్ట్ హైలైట్ అయ్యేలా కనిపిస్తుంది. మరి రాధా కృష్ణ మ్యాజిక్ థియేటర్స్ లో ఎలా ఉంటుందో చూడాల్సిందే.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :