టాక్..మరిన్ని దేశాల్లో “RRR” మేనియా ఉండబోతుందా.!

Published on Apr 14, 2022 7:04 am IST

ఈ ఏడాదిలో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన మొదట భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అనేక అంచనాల నడుమ విడుదల అయ్యి ఇండియన్ సినిమా నుంచి మరో 1000 కోట్ల సినిమాగా నిలిచి అరుదైన ఘనత ను అందుకుంది. అయితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కేవలం కొన్ని ముఖ్య దేశాల్లో మాత్రమే విడుదల అయ్యింది.

అలాగే ఇప్పుడు మరికొన్ని దేశాల్లో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. దీని ప్రకారం అయితే ఈ భారీ సినిమా మరో 30 దేశాల్లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఇంకా దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఆల్రెడీ పలు దేశస్తులు ఈ సినిమా చూసి ప్రశంసలు అందించారు. ఇప్పుడు మరిన్ని దేశాల్లో విడుదల అయ్యినా అక్కడా హిట్ అవ్వడం గ్యారెంటీ అని చెప్పాలి. అలాగే ఈ వసూళ్లతో కూడా ఈ సినిమా మరిన్ని రికార్డులు అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :