‘దర్శకుడు’ సినిమాలో ఎలాంటి సినిమా కష్టాలు ఉండవట !

28th, July 2017 - 02:41:27 PM


సుకుమార్ రైటింగ్స్ సంస్థపై రూపుదిద్దుకున్న’దర్శకుడు; చిత్రం వచ్చే నెల ఆగష్టు 4న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా హీరోయిన్ ఈషా రెబ్బ మాట్లాడుతూ ఈ సినిమాలో హీరో డైరెక్టరేనని, ఇందులో తాను ఒక ఫ్యాషన్ డిజైనర్ అని, తనది కొంచెం డిఫరెంట్ పాత్రని చెప్పుకోచ్చింది. సాధారణంగా ‘దర్శకుడు’ అనే టైటిల్ చూస్తే ఏవో సినిమా కష్టాలు ఉంటాయని అనుకుంటారని కానీ ఇందులో అలాంటివి ఏమీ ఉండవని, అంతా ప్రేమ గురించేనని, ఇది అనుకున్న గోల్ ను సాధించిన ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుందని చెప్పుకొచ్చారు.

అలాగే సినిమాలో కథ, పాటలు అన్నీ ప్రతి సిట్యువేషన్ కు తగిన పాటలు ఉంటాయని అన్నారు. సినిమా ప్రతి ఫ్రేమ్ చాలా గొప్పగా ఉంటుందని, ఆ క్రెడి డివోపి నవీన్ గారికి చేరుతుందని అన్నారు. ఇక తన వరకు సినిమాల్లో డిఫరెన్ట్ రోల్స్ చేయాలని ఉందని, ప్రతి హీరోతో నటించడానికి ఇష్టపడతానని, కానీ అవకాశాలు రావడంలేదని సరదాగా చెప్పుకొచ్చారు. నూతన దర్శకుడు హరి ప్రసాద్ జక్కా డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అశోక్ హీరోగా నటించారు.