పూరి సాయంతో పంతం నెగ్గాలనుకుంటున్న యంగ్ హీరో !
Published on Feb 13, 2017 4:45 pm IST


త్వరలో విడుదలకానున్న పూరి చిత్రం ‘రోగ్’ తో మలయాళ పరిశ్రమకు హీరోగా పరిచయం కానున్న నటుడు ఇషాన్ ఈ సినిమాతోనే ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్న పునీత్ రాజ్ కుమార్ పై పంతం నెగ్గాలనుకుంటున్నాడని సమాచారం. గతంలో పూరి తన మొదటి మలయాళం సినిమా ‘అప్పు’ తో పునీత్ రాజ్ కుమార్ ను హీరోగా పరిచయం చేశాడు. ఆ సినిమా పునీత్ ను ఓవర్ నైట్ స్టార్ హీరోని చేసేసింది. ఆ సినిమానే తెలుగులో ‘ఇడియట్’ గా వచ్చి రవి తేజకి సైతం లైఫ్ ఇచ్చింది.

అలాంటి స్టామినా ఉన్న పూరి పరిచయం చేస్తుండటంతో ఇషాన్ తప్పక స్టార్ హీరో అవుతాడని మలయాళ పరిశ్రమలో బలమైన టాక్ ప్రచారంలో ఉంది. అదీ కాక సినిమా కూడా బ్రహ్మాండంగా ఉందని , ఇషాన్ పునీత్ ను మించిపోతాడని అంటుండటంతో వీరిరువురికీ మధ్య ఈగో సమస్య తలెత్తింది. దీంతో ఇషాన్ ఎలాగైనా పూరితో చేస్తున్న సినిమాతో హిట్ కొట్టి పునీత్ పై పంతం నెగ్గాలని భావిస్తున్నాడు. మలయాళీలు కూడా ఇషాన్ మొదటి సినిమాతోనే బలమైన ముద్ర వేస్తాడని చాలా నమ్మకంగా ఉన్నారు.

 
Like us on Facebook