తెలుగులో ఒకే రోజు ఎనిమిది సినిమాలు విడుదల !

11th, November 2017 - 03:08:24 PM

శుక్రవారం వచ్చింది అంటే దాదాపు రెండు మూడు సినిమాలు అదేరోజు విడుదల కావడం చూసాం, ఒక్కోసారి నాలుగు ఐదు సినిమాలు విడుదల అవుతుంటాయి. కాని వచ్చే శుక్రవారం మాత్రం ఏకంగా ఎనిమిది సినిమాలు ఒకేరోజు విడుదల కానున్నాయి.

గోపిచంద్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఆక్సిజన్. గతంలో పోస్ట్ పోన్ ఆయిన ఈ సినిమా నవంబర్ 17 న విడుదల కానుంది. ప్రయోగాత్మక సినిమాలు చేసే కార్తీ ఈ నెల 17 న ఖాకి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నేటి యువత ప్రేమకు పెళ్ళికి ఎంత తొందర పడుతున్నారో అంత త్వరగా విడిపోతున్నారన్న కాన్సెప్ట్ తో ‘లండన్ బాబులు’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. చిన్ని కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. అవల్ పేరుతో విడుదలైన సినిమా తెలుగులో గృహం పేరుతో విడుదల కానుంది. సిద్ధార్థ్ నటించిన ఈ సినిమా అక్కడ విజయవంతం అయ్యింది. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమాలతో పాటు ‘దేవిశ్రీ ప్రసాద్’ రా రా, లవర్స్ క్లబ్ , ప్రేమతో కార్తిక్, సినిమాలు విడుదల కానున్నాయి.