‘టైగర్ నాగేశ్వరరావు’ నుండి ‘ఏక్ ధమ్ ఏక్ ధమ్’ సాంగ్ కి మంచి రెస్పాన్స్

Published on Sep 6, 2023 9:15 pm IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా యువ దర్శకుడు వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా యాక్షన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. ఈ మూవీని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ భారీ స్థాయిలో నిర్మిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈమూవీ ఫస్ట్ గ్లింప్స్ ఇటీవల రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుని మూవీ పై ఆడియన్స్ లో రవితేజ ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఏర్పరిచింది.

ఇక తాజాగా ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఏక్ ధమ్ ఏక్ ధమ్ అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. జివి ప్రకాష్ కుమార్ అందించిన మంచి మాస్ బీట్ కి భాస్కరభట్ల రచన, అలానే అనురాగ్ కులకర్ణి గాత్రం మరింత బలాన్ని అందించాయి. ప్రస్తుతం ఈ సాంగ్ 2 మిలియన్ వ్యూస్ తో అందరి నుండి మంచి రెస్పాన్స్ తో యూట్యూబ్ లో దూసుకెళుతోంది. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి అక్టోబర్ 20న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం :