‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఓవర్సీస్ రైట్స్ కొన్నది వీళ్ళే !

ekkadaki-potave-chinnavada
‘హ్యాపీ డేస్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘నిఖిల్ సిద్దార్థ’ మొదట్లో హీరోగా నిలదొక్కుకోవడంలో కాస్త తడబడ్డా వరుసగా స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య వంటి విభిన్నమైన సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ నిఖిల్ చివరి సినిమా ‘శంకరాభరణం’ మాత్రం అతనికి తీవ్ర నిరాశను మిగిల్చింది. దీంతో ఈసారి ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అనే డిఫరెంట్ చితరంతో మన ముందుకొస్తున్నాడు నిఖిల్.

ఈ చిత్రానికి విఐ. ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా మేఘనా ఆర్ట్స్ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరువుకుంటున్న ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ రైట్స్ ను ‘నిర్వాణా సినిమాస్’ వారు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రంలో నిఖిల్ సరసన హెబ్బాపటేల్, నందిత శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Exit mobile version