డిస్నీ+ హాట్ స్టార్ తొలి తెలుగు వెబ్ సిరీస్ ‘అన్హర్డ్’ను ప్రకటించిన ఎల్ల‌న్నార్ ఫిలిమ్స్..!

డిస్నీ+ హాట్ స్టార్ తొలి తెలుగు వెబ్ సిరీస్ ‘అన్హర్డ్’ను ప్రకటించిన ఎల్ల‌న్నార్ ఫిలిమ్స్..!

Published on Sep 13, 2021 3:56 PM IST


స్వాతంత్ర పోరాటంపై సగటు మనిషి దృక్పథాన్ని వెల్లడించేలా రాధికా లావు నిర్మాణ సారథ్యంలో, ఆదిత్యా కేవీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘అన్హర్డ్’ సెప్టెంబర్ 17న విడుదల కానుంది.

అన్‌హర్డ్ తెలుగు హాట్ స్టార్ స్పెష‌ల్ సిరీస్‌లోకి ప్రవేశించింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అన్‌హర్డ్ యొక్క ప్రత్యేక కథన రీతి భారత దేశ చరిత్రలో ముఖ్యమైన కాలానికి సంబంధించిన విభిన్న తాత్వికతలను వెల్లడిస్తుంది. ఈ సిరీస్ ఐదు ముఖ్యపాత్రల జీవితాలను అనుసరిస్తుంది. భారత్ ఒక దేశంగా ఆవిర్భవించేందుకు చేస్తున్న పోరాటంలో అవన్నీ తమను తాము అన్వేషించుకుంటాయి, తాము పోషించే పాత్రలను కూడా. బ్రిటిష్వారి నుంచి మాత్రమే కాదు, నిజాం నుంచి కూడా స్వాతంత్రం కోరుకోవడం చుట్టూ మరియు హైదరాబాద్ విలీనం నగర సాధారణ ప్రజానీకానికి అత్యంత ప్రాధాన్యమైందిగా మారడంపై జరిగిన ఈ విధమైన అసాధారణ సంభాషణలకు హైదరాబాద్రాజ్యం వేదికగా నిలిచింది. ఇది తిరుగులేని వినోద వీక్షణ అనుభూతిని అందిస్తుంది. ఎక్స్‌క్లూజివ్ డిస్ని పల్స్ హాట్ స్టార్ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 17 నుంచి ప్రసారంకానుంది.

ఈ కథ రాధికాలావు సారథ్యంలోని ఎల్ల‌న్నార్‌ మొదటి ప్రత్యేకమైన కాల సంబంధిత డ్రామా వెంచర్గా రూపుదిద్దుకుంది. ‘అన్హర్డ్’ ఈ విలక్షణమైన స్టోరీ టెల్లింగ్ మ‌రియు ఆదిత్యా కేవీ దర్శకత్వం ప్రపంచానికి దానికి తెలియని కథలను తెలియజేస్తుంది. అసాధారణ సంభాషణలు వారిని పోరాటవాదులుగా మార్చాయి. స్వాతంత్రం కోసం వారు తమ ప్రాణాలనే త్యాగం చేసేలా చేశాయి. చౌరిచౌరా ఉదంతం, సహాయ నిరాకరణ ఉద్యమం, స్వాతంత్రం అనంతరం పాకిస్థాన్‌లో చేరేందుకు నిజాం చేసిన విఫల ప్రయత్నంలాంటి వాటి నేపథ్యంలో స్వతంత్ర భారతావని రూపు దిద్దుకోవడం వంటివన్నీ ఇందులో చర్చకు వచ్చాయి. ఈ సిరీస్‌లో తమ విశ్వాసాలకు కట్టుబడిన సగటు ప్రజల, స్త్రీ, పురుషుల మక్కువలను మరోసారి కళ్లకు కట్టినట్లు చూపించారు. శ్రీనివాస్ అవసరాల, బాలాదిత్య, చాందిని చౌదరి, ప్రియదర్శి, అజయ్లాంటి ప్రతిభావంతులు ఈ సిరీస్‌లో నటించారు.

నిర్మాత రాధికలావు మాట్లాడుతూ అన్‌హర్డ్ అసలు ఎందుకు ఎంచుకున్నామంటే “సినిమా మాధ్యమం ద్వారా శక్తివంతమైన కథలను చెప్పడాన్ని ఎల్ల‌న్నార్ విశ్వ‌సిస్తుందని, వివాదాలతో కూడుకున్న నేటి ప్రపంచంలో సరళమైన సంభాషణ గతంగా మిగిలింది. స్వేచ్ఛ, త్యాగం, సామాజిక వర్గం, దేశం లాంటి అంశాలలో తుపాతుల్లోకి వెళ్లేందుకు చేసిన ప్రయత్నమే ‘అన్హర్డ్’.

ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించిన ఆదిత్య కేవీ మాట్లాడుతూ తమ అభిమతం ద్వారా దేశం కోసం పోరాడిన వారి ఆలోచనలను ‘అన్హర్డ్’ ద్వారా అందించాలని భావించామని, ఒక కన్వర్జేషనల్ సిరీస్‌గా ‘అన్హర్డ్’ ఒక సంక్లిష్టతను ఒక సరళ దృశ్య రూపంలో అందించామని చెప్పుకొచ్చారు.

కథాంశం:
‘అన్హర్డ్’ అనేది మొత్తం ఆరు భాగాల సిరీస్, వీటిలో ప్రతి ఒక్కటి కూడా భారతదేశ చరిత్రలోని ముఖ్య ఘట్టాలకు సంబంధించిన భిన్న దృక్పథాలను వెల్లడించేలా రూపుదిద్దుకుంది. ఇందులోని పాత్రలకు వేటికీ భవిష్యత్భారతం ఎలా ఉంటుందో తెలియదు, అయినా కూడా అవి తమ విశ్వాస వ్యవస్థలను కాపాడుకునేందుకు ప్రయత్నించాయి. తమ విశ్వాసాలపై నమ్మకం ఉజ్వల భవితను అందిస్తుందని అవి విశ్వసించాయి.

ఇక ఇప్పటి వరకూ చెప్పబడని, ఎవరికీ తెలియని కథలను స్వాతంత్రం నేపథ్యంలో చూడండి మరియు హైదరాబాద్ రాజ్యం ఎలా జీవం పోసుకుందనేది సెప్టెంబర్ 17న డిస్నీ+ హాట్ స్టార్‌లో చూడండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు