ఎమర్జెన్సీ ఫస్ట్ లుక్ – ఇందిరా గాంధీగా కంగనా రనౌత్ లుక్

Published on Jul 14, 2022 12:00 pm IST


బాక్సాఫీస్ వద్ద ఢాకడ్ పరాజయం తర్వాత, ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎమర్జెన్సీ అనే పిరియాడికల్ పొలిటికల్ డ్రామాతో వస్తోంది. ఈ సినిమాకి డైరెక్షన్‌తో పాటు కథ కూడా కంగనా రాసింది. ఆమె విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ టీజర్‌ ఆసక్తికరంగా ఉంది. ఆమె భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అనే శక్తివంతమైన మహిళ పాత్రలో కనిపిస్తుంది. టీజర్‌లో ఆమె లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతంగా ఉన్నాయి. కంగనాను అందరూ సర్ అని పిలుస్తారని అమెరికా అధ్యక్షుడికి తెలుసా అని కంగనా చెప్పే అసాధారణ డైలాగ్‌తో టీజర్ ముగిసింది.

ఎమర్జెన్సీ అనేది 1975లో జరిగిన యదార్థ సంఘటనల కథ. భారత చరిత్రలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరైన ఇందిరా గాంధీ నాయకత్వంలో జరిగిన సంఘటనలను ఈ చిత్రం వివరిస్తుంది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, భూమిక చావ్లా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. సినిమా స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ని రితేష్ షా చూసుకుంటున్నారు. మణికర్ణిక ఫిల్మ్స్ బ్యానర్‌పై రేణుపిట్టి, కంగనా రనౌత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

వీడియో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :