ఎవరు మీలో కోటీశ్వరులు: నవరాత్రి స్పెషల్ గెస్ట్ సమంత తో మరింత ఆసక్తిగా!

Published on Oct 10, 2021 5:30 pm IST

బుల్లితెర ప్రేక్షకులను ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం తో జూనియర్ ఎన్టీఆర్ విశేషం గా ఆకట్టుకుంటున్నారు. ఈ కార్యక్రమం లో నవరాత్రి వేడుకలు సందర్భం గా స్పెషల్ గెస్ట్ విచ్చేశారు. ఎన్టీఆర్ తో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సమంత ఈ కార్యక్రమం కి వస్తుండటం తో అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

కూర్చుంటే భయంగా ఉంది అని సమంత అనగా, ఉంటుంది ఇది హోస్ట్ సీట్, అది హాట్ సీట్ అంటూ చెప్పుకొచ్చారు. ఎవరైనా వెయ్యి నుండి కోటి కి వస్తారు, నువ్వు కోటి నుండి వెయ్యి కి వస్తావు ఎంత బావుంటుంది కదా ఆట అంటూ జూనియర్ ఎన్టీఆర్ అంటూ చెప్పుకొచ్చారు. తాజాగా విడుదల అయిన ప్రోమో చాలా ఆసక్తి గా ఉండటం తో ఈ షో కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :