ఎవరు మీలో కోటీశ్వరులు నుండి బ్లాక్ బస్టర్ ప్రోమో రిలీజ్…మహేష్ ఎన్టీఆర్ ఎపిసోడ్ త్వరలో!

Published on Nov 23, 2021 1:50 pm IST


జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న బుల్లితెర షో ఎవరు మీలో కోటీశ్వరులు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమం కి ఇప్పటికే పలువురు ప్రముఖులు వచ్చి ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం నుండి బ్లాక్ బస్టర్ ఎపిసొడ్ కి సంబంధించిన ప్రోమో ను తాజాగా జెమిని టీవీ విడుదల చేయడం జరిగింది.

సూపర్ స్టార్ మహేష్ డిఫరెంట్ స్టైల్ తో, స్మైల్ తో షో లో సందడి చేసినట్లు ప్రోమో ను చూస్తే తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు లు ఇద్దరూ ఒకే సారి ఒకే ఫ్రేమ్ లో ఉండటం పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎపిసొడ్ ను త్వరలో ప్రసారం చేయనున్నారు మేకర్స్.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :