బాలయ్యతో ఎమోషనల్ మూవీ ?

Published on Sep 13, 2021 8:44 am IST


నటసింహం బాలయ్య బాబుతో కొత్త నేపథ్యంలో సినిమా చేయాలని సితార సంస్థ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఓ సరికొత్త కథను ఫైనల్ చేశారని రూమర్స్ వినిపిస్తున్నాయి. సరే, రూమర్లు ఎలా ఉన్నా… సితార సంస్థ మాత్రం బాలయ్య కోసం ఒక మంచి కథను వెతుకుతుంది. వీరి కాంబినేషన్ లో ఎప్పుడు సినిమా వచ్చినా.. బాలయ్య – సితార నుంచి కొత్త రకం సినిమా రావడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం బాలయ్య, బోయపాటితో చేస్తోన్న అఖండ సినిమా చివరి దశలో ఉంది. ఈ సినిమా పూర్తి యాక్షన్ సినిమా. అందుకే, బాలయ్యతో కొత్త రకం సినిమా చేయడానికి పూనుకుంది సితార సంస్థ. ‘జెర్సీ’ లాంటి ఎమోషనల్ సినిమా చేయాలని సితార ప్లాన్. నిజానికి మంచి కథతో బాలయ్యకి ఓ ఎమోషనల్ మూవీ పడితే బాగుంటుంది. మరీ చూడాలి వీరి కలయికలో ఎలాంటి సినిమా వస్తోందో.

సంబంధిత సమాచారం :