57 దేశాల్లో ట్రెండింగ్‌లో కొనసాగుతున్న “ఆర్ఆర్ఆర్”..!

Published on Jun 2, 2022 11:01 pm IST

జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్లుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం “ఆర్‌ఆర్‌ఆర్‌”. ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా ఇప్పటికే సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇక ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసిన కూడా ఈ ఎపిక్ చార్ట్ బస్టర్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడంలేదని చెప్పాలి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 57 దేశాలలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. దీనిని బట్టి చూస్తుంటే ఆర్ఆర్ఆర్ హవా ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్‌లో ఉందనేది ఇట్టే అర్ధమవుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని, ఒలివియా మోరిస్, శ్రియా శరణ్ మరియు ఇతరులు నటించారు.

సంబంధిత సమాచారం :