రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో రామాయణం!


‘బాహుబలి-ది కంక్లూజన్’ ఫలితం ఇచ్చిన ధైర్యంతో ఇండియాలోని పలువురు పెద్ద స్థాయి నిర్మాతలు భారీ ప్రాజెక్టుల్ని చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ప్రముఖ వ్యాపారవేత్త, ఫిలాంత్రఫిస్ట్ అయిన డా. బి. ఆర్.శెట్టి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రూ. 1000 కోట్ల భారీ వ్యయంతో ‘మహాభారతం’ అనౌన్స్ చేయగా తాజాగా మరొక పురాణ గాథ రామాయణం తెరపైకొచ్చింది.

ఈ ప్రాజెక్టును తెలుగులో బడా నిర్మాతైన అల్లు అరవింద్, నమిత్ మల్హోత్ర, మధు మాతేన నిర్మిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాను త్రీడీ వెర్షన్లో మూడు భాగాలుగా రూపొందిస్తారట. తెలుగు, తమిళం, హిందీ వంటి మూడు ప్రధాన భాషల్లో ఈ సినిమా రూపొందనుందని కూడా తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుని డైరెక్ట్ చేస్తారు, నటీనటులెవరు, ఎప్పుడు మొదలవుతుంది అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.