ఇప్పుడు సోషల్ మీడియాలో సహా ఎలక్ట్రానిక్ మీడియా అంతటా వినిపిస్తున్న పేరు ‘ఎప్స్టీన్ ఫైల్స్’ (Epstein Files). అసలు తమకి సంబంధం లేని టాపిక్ కూడా తమ న్యూస్ ఫీడ్ లోకి ఎందుకు వస్తుంది అని సోషల్ మీడియాలో అర్ధం కాక తల గోక్కుంటున్నారు. కానీ ఈ ఎప్స్టీన్ ఫైల్స్ వెనుక ఉన్న లోతైన కథ విన్నాక మాత్రం అంతా షాకవుతున్నారు. అసలు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఏంటి? ఎందుకు ఇప్పుడు ఇంతలా వైరల్ అవుతుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ అంశంపై ఓ పాపులర్ ఓటిటి సంస్థ ఎప్పుడో డాక్యు చిత్రాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది.
ఏంటీ ఎప్స్టీన్ ఫైల్స్?
అమెరికాకి చెందిన జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein) అనే ఫైనాన్సియర్ కోసమే ఇందులో ప్రధాన కథ. చిన్న చిన్న పిల్లలతో అతడు చేసిన అకృత్యాలు, రాజకీయ, ఆర్ధిక శక్తులతో చేసిన అరాచకాలు లక్షల్లో బయటకి వస్తుండడం విస్మయానికి గురి చేస్తుంది. ఇలా తనపై పలు షాకింగ్ నిజాలని ఈ ఎప్స్టీన్ ఫైల్స్ చెబుతుంది.
Jeffrey Epstein: Filthy Rich on Netflix – నెట్ ఫ్లిక్స్ లో ఎప్పుడో డాక్యు చిత్రం
వరల్డ్ పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో జెఫ్రీ ఎప్స్టీన్: ఫిల్తి రిచ్ (Jeffrey Epstein: Filthy Rich) అనే డాక్యు చిత్రాన్ని దాదాపు ఐదేళ్ల కితమే రిలీజ్ చేశారు. అయితే ఈ డాక్యు చిత్రంలో ఇప్పుడు బయటకి వచ్చిన ఊహించని నిజాలకి సంబంధించి పలు ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తుంది. కానీ వాటికి కొనసాగింపు గానే మరిన్ని లోతైన అంశాలు ఇప్పుడు బయటకి వస్తున్నాయట. ఇంట్రెస్టింగ్ గా ఈ సిరీస్ ఇప్పుడు ఇండియన్ ఓటిటిలో నెంబర్ 2 లో ట్రెండ్ అవుతుంది. సో ఈ ఎప్స్టీన్ స్టోరీ కోసం తెలుసుకోవాలి అనుకునేవారికి నెట్ ఫ్లిక్స్ లో ఈ డాక్యు చిత్రం ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంది చూడొచ్చు.
