ఘనంగా ‘ఎర్రచీర’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ మధు యాష్కి

Erra Cheera

శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్లపై సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎర్రచీర – ది బిగినింగ్’. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ చిత్రబృందాన్ని అభినందించారు. “ట్రైలర్ చాలా కొత్తగా ఉంది. ఫిబ్రవరి 6న నేను స్వయంగా టికెట్ కొనుక్కుని సినిమా చూస్తా. చిన్న సినిమాలకు పరిశ్రమలో, ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అవసరం” అని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని, నటి కారుణ్య చౌదరి కీలక పాత్రలు పోషించారు.

సినిమాను సుమారు 300 థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఎన్వీవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇక దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ.. సినిమాపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ప్రేక్షుకులకు సినిమా ఎక్కడైనా బోర్ కొడితే టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తానని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.

Exit mobile version