దీపావళికి రాబోతున్న “ఎటర్నల్స్”..!

Published on Oct 19, 2021 2:01 am IST


ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న 25వ చిత్రం ‘ఎటర్నల్స్’. దీపావళి కానుకగా ఈ చిత్రం నవంబర్ 5న ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో గెమ్మా ఛాన్, లియా మేక్ హ్యూజ్, రిచర్డ్ మేడెన్, కుమాల్ నాంజాయిని, బ్రెయిన్ టైరి హెన్రీ, బ్యారీ కాగన్, డాన్ లీ, లరెన్ రిడల్ఫ్, సల్మా హాయక్, కిట్ హరింగ్టన్, ఏంజెలీనా జోలీ నటించారు. ఈ చిత్రాన్ని కెవిన్ ఫీజ్, నెట్ మూరె నిర్మించారు.

అయితే సూపర్ హీరోలు గ్రూపులుగా ఏర్పడి భూమిని, భూమిపై ఉన్న మనుషులను కాపాడేందుకు ప్రయత్నిస్తుంటారు. వీరిని ‘ఎటర్నల్స్’గా పిలుస్తారు. ఒలంపియా గ్రహం నుంచి కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమిపైకి వచ్చిన మరణం లేని ఏలియన్సే ఈ ఎటర్నల్స్. మరీ ఈ దీపావళికి రాబోతున్న ‘ఎటర్నల్స్’ అవెంజర్స్‌ని మించి ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :

More